నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’. అక్కి విశ్వనాధరెడ్డి దర్శకుడు. మూన్ లైట్ డ్రీమ్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో టీజర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. హీరో సందీప్‌కిషన్ టీజర్‌ని లాంచ్ చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.
ఒక దేశభక్తి సినిమా తీస్తూ ‘చైనా పీస్’ అనే పేరు పెట్టడం నిజంగా ఛాలెంజ్‌తో కూడిన విషయం అని, ఈ సినిమా అందరికీ నచ్చుతుందని దర్శకుడు అక్కి విశ్వనాథరెడ్డి నమ్మకం వెలిబుచ్చారు. ఒక సాలిడ్ కమర్షియల్ సినిమాలో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలో అన్ని రకాల ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయని హీరో నిహాల్ తెలిపారు.
అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే సినిమా ఇదని మరో హీరో సూర్య శ్రీనివాస్ నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా కమల్ కామరాజ్, హర్షిత, దీక్ష పంత్ కూడా మాట్లాడారు. రఘుబాబు, రంగస్థలం మహేశ్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సురేష్ రగుతు, సంగీతం: కార్తీక్ రోడ్రిగ్జ్.