Chikiri Song | రామ్ చరణ్ చేసిన చికిరి చికిరి స్టెప్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతం, రామ్ చరణ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్ కలిసివచ్చి ఈ పాటను సోషల్ మీడియాలో సునామీలా మార్చేశాయి. యూట్యూబ్‌లో కూడా ఈ పాట వ్యూస్ వేగంగా పెరుగుతూ 100 మిలియన్ మార్క్(10 కోట్ల) ను చేరుకుంది. 16 రోజుల్లో అన్ని భాషల్లో కలిపి ఈ రికార్డ్ సాధించినట్టు మేకర్స్ తెలియజేశారు. ఈ రికార్డ్ పట్ల మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలలోనే కాదు… ఉత్తర భారతదేశం, విదేశాల్లో ఉన్న సినీ అభిమానులు కూడా ఈ పాటకు ఫిదా అవుతున్నారు
ఈ పాటకు వేసిన స్టెప్పులు, ముఖ్యంగా రామ్ చరణ్ చేసిన చికిరి స్టెప్, సాధారణ డ్యాన్స్ స్టెప్కంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉందని నిపుణులు చెబుతుండటంతో మరోసారి పెద్ద చర్చకు దారితీసింది.ఈ స్టెప్ చేస్తూ కాళ్లు, చేతులు ఒకేసారి కదిలించటం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది అని వైద్య నిపుణులు అంటున్నారు. మెదడు మరియు శరీరానికి ఆక్సిజన్ సరఫరా సమానంగా జరుగుతుంది. హార్ట్ రేట్ నియంత్రణలో ఉండటంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. లైట్ కార్డియో వర్కౌట్లానే పనిచేసి రోజువారీ శక్తిని పెంచుతుందని చెబుతున్నారు.జిమ్‌లలో కూడా ఇప్పుడు చాలామంది యువత చికిరి చికిరి స్టెప్స్ వేస్తూ తీసిన వీడియోలు షేర్ చేస్తుండటం ట్రెండ్ అయ్యింది.
అయితే ఇది కూడా వ్యాయామం కాబట్టి, హెల్త్ ఇష్యూలు ఉన్నవారు తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పాట కేవలం మ్యూజిక్ హిట్ కాదు… ఇప్పుడు ఫిట్నెస్ మూడ్‌ను కూడా సెట్ చేస్తోందని చెప్పాలి. ఇక మూవీ చిత్రీకరణ కూడా 60శాతం పూర్తయింది. మరోవైపు ప్రమోషన్స్‌ని కూడా వేగవంతం చేశారు. ఈ సినిమా నుంచి రెండో సింగిల్‌ని వచ్చే నెల 3వ వారంలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రం సంక్రాంతికి విడుదల కానుండటంతో ఆ సినిమా ప్రమోషన్స్‌కి ఇబ్బంది లేకుండా, వారికి అడ్డంకి కాకుండా, జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని పాటను విడుదల చేస్తారట. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందుశర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు.