The Girlfriend | కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna) బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తుందని తెలిసిందే. ఓ వైపు పాన్ ఇండియా మార్కెట్‌పై ఫోకస్ పెడుతూనే మరోవైపు ఫీ మేల్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. రష్మిక లీడ్ రోల్లో నటిస్తున్న మూవీ ది గర్ల్‌ఫ్రెండ్ (The Girlfriend). టాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత ఈ మూవీ నుంచి ఆసక్తికర అప్డేట్ అందించారు మేకర్స్.
ఈ చిత్రంలో మరో అందాల భామ కీలక పాత్రలో నటిస్తోంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరనే కదా మీ డౌటు. పలు చిత్రాల్లో నటించినా ఆశించిన స్థాయిలో బ్రేక్ అందుకోని చికాగో భామ అనూ ఇమ్మాన్యుయేల్. ఈ విషయాన్ని రాహుల్ రవీంద్రన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ఈ స్టిల్‌లో అనూ ఇమ్మాన్యుయేల్‌పై వచ్చే సీన్‌ను మానిటర్లో చెక్ చేసుకుంటున్నాడు రాహుల్ రవీంద్రన్. ఇంతకీ ఈ బ్యూటీని ఎలాంటి పాత్రలో చూపించబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ యాక్టర్ దీక్షిత్ శెట్టి కీ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి పాపులర్ మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తుండటంతో మ్యూజిక్ ఆల్బమ్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

The Girl Friend