Srija| మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ విడాకుల విషయంలో హాట్ టాపిక్‌గా మారడం మనం చూశాం. మొదట శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ ఆ తర్వాత పెద్దలు కుదిర్చిన వ్యక్తితో వివాహం జరిపించారు. అయితే ఈ రెండు పెళ్లిళ్లు కూడా పెటాకులు అయ్యాయి. అయితే ఇంత వరకు ఆమె పెళ్లిళ్ల గురించి ఎవరు ఎక్కడ మాట్లాడలేదు,.అయితే ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిరంజీవి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీజ విడాకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన చెల్లెళ్లు, నాగబాబుతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరు కూతురు విడాకుల గురించి మాట్లాడడం చర్చనీయాంశం అయింది.
తల్లి అంజనాదేవి గురించి ఎంతో గొప్పగా చెబుతూ…అమ్మకు నాగబాబు అంటే చాలా ఇష్టమని ఇప్పటికీ కూడా వాడిని దగ్గరికి తీసుకొని నుదుటిపై ముద్దులు పెడుతుందని చెప్పుకొచ్చారు మెగాస్టార్. ఇక అమ్మ అంటే శ్రీజకి కూడా చాలా ఇష్టమని, తన జీవితానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కచ్చితంగా నాన్నమ్మ సలహా తీసుకుంటుందని చిరంజీవి చెప్పుకొచ్చారు. విడాకుల సమయంలో కూడా శ్రీజ తన నాన్నమ్మ సలహా తీసుకుందని, ఆ సమయంలో పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిందని చిరంజీవి అన్నారు. రెండుసార్లు విడాకులు తీసుకున్న సమయంలో శ్రీజ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నట్టు చిరంజీవి గుర్తు చేసుకున్నారు.
శ్రీజ తన జీవితానికి సంబంధించిన ఏ విషయం అయిన శ్రీజ తన నాన్నమ్మ సలహా తీసుకొని ముందుకు వెళుతుందని అన్నారు. అయితే విడాకుల సమయంలో శ్రీజకి తన తల్లి.. ఎవరో ఒకరి గురించి నీ జీవితం ఇక్కడితో ఆగిపోకూడదు. నువ్వు ముందుకు వెళ్లాలి అంటూ నా కూతురిలో ధైర్యాన్ని నింపారు అంటూ చిరంజీవి అన్నారు. చిన్నప్పటి నుండి మాలో కూడా అంజనమ్మ గారు ఎంతో ధైర్యాన్ని నింపారని చిరు స్పష్టం చేశారు. ఇక అంజనా దేవి కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి క్రమంగా కోలుకున్న విషయం తెలిసిందే.