‘ఛెల్లో షో’ బాలనటుడు రాహుల్ కన్నుమూత
భారత్ తరపున ఆస్కార్‌లో అధికారిక ఎంట్రీ దక్కించుకున్న గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’లోని బాలుర బృందంలో ఒకరిగా కీలక పాత్రను పోషించిన పదేళ్ల రాహుల్ కోలి ఈ నెల 2వ తేదీన కన్నుమూసినట్లు అతని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
భారత్ తరపున ఆస్కార్‌లో అధికారిక ఎంట్రీ దక్కించుకున్న గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’లోని బాలుర బృందంలో ఒకరిగా కీలక పాత్రను పోషించిన పదేళ్ల రాహుల్ కోలి ఈ నెల 2వ తేదీన కన్నుమూసినట్లు అతని కుటుంబ సభ్యులు వెల్లడించారు. తన కుమారుడు రాహుల్ కొద్ది మాసాలుగా కేన్సర్‌తో బాధపడుతున్నాడని, జామ్‌నగర్ దగ్గరలోని తమ సొంత గ్రామం హపాలో తుది శ్వాస విడిచాడని అతని తండ్రి రాము కోలి తెలిపారు. ‘ఛెల్లో షో’ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. సినిమా విడుదలకు రెండు రోజుల ముందు బాల నటుడు రాహుల్ కోలి మరణంతో చిత్ర బృందం విషాదంలో మునిగిపోయింది. సినిమాను అమితంగా ప్రేమించే తొమ్మిదేళ్ల బాలుడి కథతో ‘ఛెల్లో షో’ చిత్రాన్ని తెరకెక్కించారు. నళిన్ పాన్ దర్శకత్వం వహించారు. సినిమాలోని ఆరుగురు బాలుర బృందంలో రాహుల్ ఒకరిగా నటించారు. ‘ఛెల్లో షో’ ఈ నెల ‘లాస్ట్ ఫిల్మ్ షో’ పేరుతో ఇంగ్లీష్‌లో విడుదల కాబోతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water conservation | నీటి కోసం స్ఫూర్తిగా నిలిచిన.. ఆదర్శ నగర్ కాలనీ వాసులు
Heart Diseases | పండుగ సమయంలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ.. హృదయ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..
Two students die | ప్రాణాలు తీసిన సెలవుల సరదా.. క్వారీ గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి : జూలకంటి రంగారెడ్డి
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

