Rishab Shetty | ‘కాంతార’ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు కన్నడ నటుడు రిషబ్‌శెట్టి. దక్షిణ కన్నడ సంస్కృతి, ఆచార వ్యవహారాల నేపథ్యంలో రూపొందిన డివోషనల్ థ్రిల్లర్‌గా ‘కాంతార’ పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ దక్కించుకుంది. ప్రస్తుతం రిషబ్‌శెట్టి ‘కాంతార’ ప్రీక్వెల్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. తెలుగులో ‘జై హనుమాన్’ సినిమా చేస్తున్నారు. ఇదిలావుండగా ఆయన ఛత్రపతి శివాజీ పాత్రలో నటించనున్నారని గతంలో వార్తలొచ్చాయి.
తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సందీప్‌సింగ్ దర్శకత్వం వహిస్తారు. ఈ ఏడాది మే నెలలో జరుగనున్న ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రిషబ్‌శెట్టి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తామని, 2027 జనవరి 21న హిందీతో పాటు వివిధ భారతీయ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాలో మొఘల్స్‌తో శివాజీ సాగించిన పోరాటం, సాంఘిక న్యాయం కోసం ఆయన చేపట్టిన సంస్కరణలను చూపించబోతున్నామని మేకర్స్ పేర్కొన్నారు.