Chhaava Movie | బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ (Vicky Kaushal) నటించిన రీసెంట్ సూపర్ హిట్ చిత్రం ఛావా (Chhaava). ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్(Lakshman Utekar) దర్శకత్వం వహించగా.. మడాక్ ఫిల్మ్స్ పతాకం పై దినేశ్ విజన్ ఈ సినిమాను నిర్మించాడు. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్(Chatrapathi Shivaji Maharaj) పెద్ద కుమారుడు శంభాజీ మహరాజ్(Shambaji MAharaaj) జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా వచ్చింది. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు నమోదు చేస్తుంది. ఇప్పటికే రూ.370 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం రూ.400 కోట్ల మార్క్‌కి దూసుకెళుతుంది. అయితే ఈ సినిమా ఒక హిందీలోనే విడుదల కావడంతో వేరే భాషలో చూద్దామనుకున్న ప్రేక్షకులకు నిరాశ ఎదురైన విషయం తెలిసిందే.
మరోవైపు ఈ సినిమాను తెలుగు వెర్షన్లో విడుదల చేయాలని కూడా పెద్ద ఎత్తున్న డిమాండ్ వచ్చింది. దీంతో చిత్రయూనిట్ దిగివచ్చి తెలుగులో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ప్రముఖ టాలీవుడ్ బ్యానర్ గీతా ఆర్ట్స్ ఈ సినిమాను మార్చి 07న తెలుగులో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు వెర్షన్‌కి డబ్బింగ్ పనులు జరుగుతుండగా.. త్వరలోనే మూవీ నుంచి అధికారిక ప్రకటన వెల్లడించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో విక్కీ కౌశల్ పాత్రకి తెలుగు అగ్ర హీరోతో డబ్బింగ్ చెప్పిస్తున్నట్లు సమాచారం.