Chhaava Movie | బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ (Vicky Kaushal) నటించిన ఛావా చిత్రం బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతుంది. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదల రోజు నుంచే థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రూ.300 కోట్ల వసూళ్లను దాటిన ఈ చిత్రం తాజాగా రూ.400 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయ్యింది. దీంతో ఈ ఏడాది ఈ ఘనతను అందుకున్న మొదటి చిత్రంగా ఛావా నిలిచింది. ఇక ఈ విషయాన్ని బాలీవుడ్ మూవీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఎక్స్ ద్వారా వెల్లడించాడు. ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్(Lakshman Utekar) దర్శకత్వం వహించగా.. మడాక్ ఫిల్మ్స్ పతాకం పై దినేశ్ విజన్ ఈ సినిమాను నిర్మించాడు. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్(Chatrapathi Shivaji Maharaj) పెద్ద కుమారుడు శంభాజీ మహరాజ్(Shambaji MAharaaj) జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా వచ్చింది. రష్మిక మందన్నా కథానాయికగా నటించింది.
మరోవైపు ఇదే సినిమాను తెలుగులో విడుదల చేయబోతున్నారు మేకర్స్. టాలీవుడ్ టాప్ బ్యానర్ గీతా ఆర్ట్స్ ఈ సినిమాను తెలుగులో మార్చి 07న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.