Vicky Kaushal Chhaava Making Video | బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ఛావా(Chhaava). రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతుంది. ఇప్పటికే రూ.145 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం రూ.200 కోట్ల దిశగా దూసుకెళుతుంది. అయితే ఈ సినిమాకి వస్తున్న స్పందనపై చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. మా కష్టానికి ఫలితం దక్కినట్లుందని తెలిపింది.
ఈ సందర్భంగా మూవీ నుంచి ఛావా మేకింగ్ వీడియో(Chhaava Making Video)ను విడుదల చేసింది. ఈ వీడియోలో ఛత్రపతి శంభాజీ మహరాజ్ పాత్ర కోసం విక్కీ ఎలా కష్టపడ్డాడో మేకర్స్ చూపించారు. ఈ సినిమా కోసం దాదాపు 6 నెలల పాటు శిక్షణ తీసుకున్నట్లు విక్కీ వెల్లడించాడు. ఈ శిక్షణలో భాగంగా గుర్రపు స్వారీ, యుద్ధంలో కత్తితో పాటు డాలు, చాకు, బల్లెం ఎలా ఉపయోగించాలో శిక్షణ తీసుకున్నాడు. అలాగే శంభాజీ మహారాజ్‌గా ధృఢమైన శరీరంతో కనిపించేందుకు కండలు పెంచడమే కాకుండా 100 కిలోల బరువు పెరిగినట్లు తెలిపాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.