Vennela Kishore | వెన్నెల కిషోర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘చారి 111’. టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో అదితి సోని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంయుక్తా విశ్వనాథన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఈ చిత్రం కాన్సెప్ట్ టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక యాక్షన్ కామెడీ సినిమా.
ఇందులో ‘వెన్నెల కిషోర్ గూఢచారి పాత్రలో కనిపిస్తారు. ఓ సీటిలో జరిగే అనుమానాస్పద ఘటనలను చేధించే రహస్య గూఢచారి పాత్రలో ఆయన లుక్ వైవిధ్యంగా వుంటుంది. స్టెలిష్ యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం వినోదభరితంగా సాగుతూ ప్రేక్షకుడిని అలరించే విధంగా చిత్రం వుంటుంది’అన్నారు.