చరణ్ లక్కరాజు, యశశ్రీ జంటగా నటిస్తున్న సినిమా ‘ఛూ మంతర్’. ఈ చిత్రాన్ని అద్వితీయ మూవీస్ పతాకంపై వెంకట్ కిరణ్‌కుమార్ కాళ్లకూరి నిర్మిస్తున్నారు. బి.కళ్యాణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్ ఫిలింనగర్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత కిరణ్ కుమార్ మాట్లాడుతూ…
‘మా సంస్థలో ఇప్పటికే హాష్‌ట్యాగ్ కృష్ణారామ, గ్రే అనే సినిమాలు నిర్మించాం. మా ప్రొడక్షన్లో మూడో చిత్రమిది. సరికొత్త కాన్సెప్ట్‌తో నిర్మిస్తున్నాం. నేటి నుంచే రెగ్యులర్ చిత్రీకరణ మొదలుపెడతాం’ అన్నారు. రూపాలక్ష్మీ, చిత్రం శ్రీను, యోగి కత్రి, జబర్దస్త్ కొమురం, గడ్డం నవీన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : మధుసూదన్ కోట, సంగీతం : సుధా శ్రీనివాస్.