రజనీకాంత్, నయనతార, ప్రభు, జ్యోతిక ప్రధాన పాత్రలలో రూపొందిన సూపర్ హిట్ చిత్రం చంద్రముఖి.ఈ సినిమా ప్రేక్షకులకి ఎంత థ్రిల్ కలిగించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రజనీ కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు, కానీ రజనీ మళ్లీ ఈ కథను టచ్ చేయడానికి అంతగా ఆసక్తిని చూపడం లేదనే వార్తలు అప్పట్లో తెగ హల్ చల్ చేశాయి.
తాజా సమాచారం ప్రకారం లారెన్స్- వాసు కాంబినేషన్లో చంద్రముఖి సీక్వెల్ రూపొందనుందనే టాక్ వినిపిస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన శివలింగ చిత్రం చాలా భయపెట్టించింది. ఇప్పుడు మంచి స్క్రిప్ట్‌తో వాసు సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుండగా, ఇందులో టైటిల్ రోల్ కోసం అనుష్కని సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది.
ఏ పాత్రలోనైన ఇట్టే ఒదిగిపోయే అనుష్క చంద్రముఖి సీక్వెల్‌కి పర్ఫెక్ట్ యాప్ట్ అని కొందరు అంటున్నారు. నిశ్శబ్దం తరువాత అనుష్క మరో తెలుగు సినిమా ఒప్పుకోలేదు. ‘సింగం 3’ తరువాత తమిళంలో మరో సినిమా చేయలేదు. అభిమానులు మాత్రం ఆమె నుంచి మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.