రోషన్ కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’. అనశ్వర రాజన్ కథానాయిక. ప్రదీప్ అద్వైతం దర్శకుడు. స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 25న గ్రాండ్‌గా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ను శనివారం చిత్రబృందం ప్రకటించింది.
80ల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నందమూరి కల్యాణచక్రవర్తి ఈ సినిమాతో మళ్లీ కంబ్యాక్ ఇస్తున్నారు. చిరంజీవి ‘లంకేశ్వరుడు’ సినిమా తర్వాత ఆయన మళ్లీ సినిమాలు చేయలేదు. 36ఏండ్ల విరామం తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ ఆయన తెరపై కనిపించబోతున్నారు. ఇందులో ఆయన పోషిస్తున్న పాత్ర పేరు ‘రాజిరెడ్డి’. ఈ పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. గ్రే హెయిర్, స్టన్నింగ్ ఎక్స్ప్రెషన్తో ఇంటెన్స్ అవతార్‌లో కనిపిస్తున్న కల్యాణచక్రవర్తిని ఈ పోస్టర్లో చూడొచ్చు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.మదీ, సంగీతం: మిక్కీ జె.మేయర్.