వేణు ఊడుగుల (Venu Udugula) డైరెక్షన్లో వస్తున్న చిత్రం విరాటపర్వం (Virataparvam). రానా (Rana Daggubati), సాయిపల్లవి (Sai Pallavi) కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలై పాటలు, టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. జూన్ 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. కాగా తాజాగా ఈ చిత్రం నుంచి ఛలో ఛలో ఛలో..ది వారియర్ సాంగ్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
‘ఛలో ఛలో ఛలో ఛలో ఛల్ పెరుగెత్తు..అడుగే పిడుగై రాలేలాగా గుండెల దమ్మును చూపించూ..ఛలో ఛలో ఛలో..శ్రీకాకుళంలో రాలిన పూలను గుండెకు హద్ది నిలిదీద్దాం. సిరి గల భూములు చెర విడిపించి నిరుపేదలకే పంచేద్దాం’ అంటూ రానా గూస్ బంప్స్ తెప్పించేలా పాడిన ఈ పాట అందరినీ ఆలోచింపజేసేలా ఉద్యమంలా సాగుతుండటం చూడొచ్చు. జిలుకర శ్రీనివాస్ రాసిన ఈ పాటను సురేశ్ బొబ్బిలి కంపోజిషన్‌లో ఆయనే స్వయంగా పాడారు.
1990లలో పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నివేదా పేతురాజ్, ప్రియమణి, నవీన్‌చంద్ర, సాయిచంద్, జరీనా వహబ్, ఈశ్వరీరావు, నందితా దాస్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్.
Read Also : Tamil Film Industry | 2019 తర్వాత తమిళ ఇండస్ట్రీకి పెద్ద హిట్టు ఇదేనట..!
Read Also : Pakka Commercial Trailer | ‘క్రిమినల్స్ మన పాలిట దేవుళ్లు..’ పక్కా కమర్షియల్ ట్రైలర్
Read Also : Spider Man | ఓటీటీలోకి ‘స్పైడర్ మ్యాన్:నో వే హోమ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
Read Also : Ante Sundaraniki Review | అంటే సుందరానికీ రివ్యూ..