ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే సిటీకి ప్రమాదం రావడంతో ఆ కేసును పరిష్కరించడానికి కన్ఫ్యూజ్డ్ స్పై చారి వస్తారు. ఆ కేసును చారి ఎలా సాల్వ్ చేశాడనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘చారి 111’. వెన్నెల కిశోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి టి.జి.కీర్తికుమార్ దర్శకుడు. సంయుక్త విశ్వనాథన్ కథానాయిక. బర్కత్ స్డూడియో పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని మంగళవారం విడుదల చేశారు. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే స్పై యాక్షన్ కామెడీ సినిమా ఇదని, సిల్లీ మిస్టేక్స్ చేసే కన్ఫ్యూజ్డ్ స్పై ఓ పెద్ద కేసును ఎలా సాల్వ్ చేశాడనేది ఈ సినిమా కథాంశమని, గూఢచారి సంస్థ హెడ్ పాత్రలో మురళీశర్మ నటించారని, ఆయన పాత్ర సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు చెప్పారు. ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వస్తున్నదని, చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన మరికొన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని నిర్మాత తెలిపారు. బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్, పావనిరెడ్డి, తాగుబోతు రమేశ్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కషిష్ గ్రోవర్, సంగీతం: సైమన్ కె.కింగ్, నిర్మాణం: బర్కత్ స్టూడియోస్.