Megastar Chiranjeevi | కేంద్రమంత్రి కిషన్రెడ్డి మెగాస్టార్ చిరంజీవిని మర్యదపూర్వకంగా కలిశారు. నేడు మధ్యాహ్నం చిరంజీవి ఇంటికి వెళ్లిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి చిరుకు పుష్ఫం గుచ్ఛం ఇచ్చి దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. అనంతరం శాలువాలు కప్పుకుని ఒకరిని ఒకరు సత్కరించుకున్నారు. ఇక ఈ సమవేశంలో వీరిద్దరు పలు అంశాలపై చర్చించారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను అటు చిరంజీవితో పాటు కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా పంచుకున్నారు. చలనచిత్ర పరిశ్రమకు చేసిన కృషి ద్వారా చాలామందికి స్పూర్తిని ఇచ్చారని. అలాంటి వారిని కలవడం ఎప్పుడు ఆనందంగానే ఉంటుందని కిషన్ రెడ్డి రాసుకొచ్చాడు.
Met Shri K. Chiranjeevi Garu in Hyderabad on the occasion of Diwali and conveyed festive greetings.
It is always a delight to meet such a good human and the Megastar, who has inspired many through his philanthropic work and contributions to the film industry.@KChiruTweets pic.twitter.com/NzvipjIFj0
— G Kishan Reddy (@kishanreddybjp) November 2, 2024