Ravanasura | రావణాసురలో 25 కట్స్ కోరిన సెన్సార్ బోర్డు.. కానీ..
రవితేజ (Ravi Teja) నటిస్తోన్న క్రైం థ్రిల్లర్ రావణాసుర (Ravanasura). ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రావణాసుర పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. కాగా రావణాసుర సెన్సార్ స్క్రీనింగ్ పూర్తయినట్టు ఓ వార్త బయటకు వచ్చింది.
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటిస్తోన్న క్రైం థ్రిల్లర్ రావణాసుర (Ravanasura). సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో రవితేజ టీం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే విడుదలైన రావణాసుర పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
కాగా రావణాసుర సెన్సార్ స్క్రీనింగ్ పూర్తయినట్టు ఓ వార్త బయటకు వచ్చింది. అయితే ఈ చిత్రానికి క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేయాలంటే సుమారు 25 కట్స్ ఉండాలని సెన్సార్ అధికారులు చెప్పినట్టు ఇన్సైడ్ టాక్. వారు చెప్పినట్టు చేస్తే సినిమా ఫ్లో దెబ్బతినడమే కాకుండా నిడివి 20 నిమిషాలు కుదించబడుతుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు ఏ సర్టిఫికెట్‌తోనే స్క్రీనింగ్‌కు వెళ్లాలని ఫిక్సయినట్టు అప్డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో జోరుగా టాక్ వినిపిస్తోంది. సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో కొన్ని హానికరమైన సన్నివేశాలుండటం సహజమే. ఈ తరహా సినిమాలకు ఏ సర్టిఫికెట్ రావడం పెద్ద విషయమేమి కాదు. మేకర్స్ తాము సినిమాలో చూపించాలనుకున్న అంశాలు సినిమాలో మిస్సవకుండా చూసుకుంటున్నారని తాజా అప్డేట్ తో అర్థమవుతుంది.
రావణాసురలో అనూ ఎమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. సుశాంత్ విలన్‌గా నటిస్తున్నాడు. రావణాసుర చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రావణాసుర చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్- భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. రవితేజ మరోవైపు పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వర్‌రావులో కూడా నటిస్తున్నాడు. బాలీవుడ్ భామ కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది.
రావణాసుర ఆంథెమ్ లిరికల్ వీడియో సాంగ్..
రావణాసుర గ్లింప్స్ వీడియో..
డిక్కా డిష్యుమ్ సాంగ్..
రావణాసుర ట్రైలర్..
Read Also
Athulyaa Ravi | మెగాస్టార్ చిరంజీవితో అతుల్య రవి.. ట్రెండింగ్‌లో ఫొటోలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

