మెగాస్టార్ చిరంజీవిని స్పూర్తిగా తీసుకొని ఎంతో మంది సినిమాలలోకి వచ్చారు. వారిలో అల్లు అర్జున్ ఒకరు. చిరంజీవి డ్యాన్స్ చూసి ఫుల్ ఇంప్రెస్ అయిన బన్నీ ఆయనలా డ్యాన్స్ చేయాలని చాలా కష్టపడ్డాడు. డాడీ సినిమాలో చిరుతో కలిసి డ్యాన్స్ చేసే అవకాశాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ డ్యాన్సర్లలో బన్నీ ఒకరని చెప్పవచ్చు.
ఈ రోజు చిరంజీవి బర్త్ డే సందర్భంగా బన్నీ తన ఇన్స్టాగ్రామ్ లో చిరుతో సెట్లో దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. మీకు, నాకు ఒకే ఒక్క మెగాస్టార్ చిరంజీవి అంటూ బర్త డే విషెస్ తెలియజేశారు బన్నీ. అల్లు అర్జున్ పోస్ట్ మెగా అభిమానులని ఎంతగానో అలరిస్తుంది. చిరంజీవికి విషెస్ తెలియజేసిన ప్రభాస్..హ్యాపీ బర్త్ డే టు మెగా మెగా మెగా…మెగా మెగాస్టార్ చిరంజీవిగారు. మా తరానికే కాదు. భవిష్యత్ తరాలకు కూడా మీరు స్ఫూర్తి సార్ అని వీడియో ద్వారా తెలిపాడు.
ఇక విక్టరీ వెంకటేష్.. చిరంజీవితో కలిసి దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. నాకు గైడ్, నన్ను ప్రోత్సహించే చిరంజీవిగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇక పై మీరు మీ జీవితంలో మునుపటి కంటే ఎక్కువ సక్సెస్ను చూడాలి అని స్పష్టం చేశారు.