టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సినీ పీఆర్వో బీఏ రాజు (62) హఠాన్మరణం ఇండస్ట్రీకి పెద్ద షాకింగ్‌గా మారింది. ఎంతో మంది సినీ సెలబ్రిటీలతో సాన్నిహిత్యంగా ఉంటూ మంచి సంబంధాలను కొనసాగిస్తున్న బీఏ రాజు ఆకస్మిక మరణం చెందడంతో మహేష్ బాబు, ఎన్టీఆర్ ,దేవి శ్రీ ప్రసాద్ వంటి ప్రముఖులు దిగ్భ్రాంతి చెందారు. మహేష్ బాబు తన ట్విట్టర్లో .. బీఏ రాజు గారు చిన్నప్పటి నుండి తెలుసు. ఆయనతో కలిసి పని చేశాను. సినీ పరిశ్రమలో ఆయన ఒక జెంటిల్మెన్. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. రాజుగారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని మహేష్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
పీఆర్వోగా, జర్నలిస్ట్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీకి గొప్పసేవలు అందించిన బీఏ రాజు గారు ఆకస్మిక మరణం చెందడంతో షాక్ అయ్యారు. ఇండస్ట్రీకి గొప్ప సేవలు అందించారు ఆయన. రాజుగారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. దర్శకులు సంపత్ నంది, మెహర్ రమేష్‌లు, యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్, రైటర్ గోపీ మోహన్, దర్శకనిర్మాత మధురా శ్రీధర్ తదితరులు సోషల్ మీడియాలో బీఏ రాజు మృతి పట్ల నివాళులర్పించారు.
May your soul rest in peace! Raju garu, you will be terribly missed. Sending love and strength to his son in these tough times. 🙏🙏🙏
— Mahesh Babu (@urstrulyMahesh) May 21, 2021
The sudden demise of BA Raju Garu has left me in shock. As one of the most senior film journalists & PRO,he has contributed greatly to the Film Industry. I've known him since my earliest days in TFI. It is a huge loss.Praying for strength to his family. Rest in Peace Raju Garu 🙏🏻 pic.twitter.com/B5lytChlqW
— Jr NTR (@tarak9999) May 22, 2021