ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో రాణించాలంటే కష్టమైన పని అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందులో నా హీరోయిన్ అవ్వాలంటే పడరాని పాట్లు పడాలి. ఎన్నో అవమానాలు ఎదుర్కొంటే కాని హీరోయిన్గా మారే అవకాశం రాదు. ఇక స్టార్ హీరోయిన్గా మారాలంటే డెడికేషన్‌గా పని చేయాల్సి ఉంటుంది. ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్న భామల్లో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఒకరు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో సాదాసీదా అమ్మాయి పాత్రలో కనిపించిన రకుల్…ఇపుడు సౌతిండస్ట్రీ (South film Industry) లో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్.
ఫిబ్రవరి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women’s Day) సందర్భంగా తనకు సంబంధించిన పలు విషయాలను అందరితో పంచుకుంది రకుల్. ఓ చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..డెబ్యూ సినిమా చేసే కంటే ముందు ఓ కాస్టింగ్ డైరెక్టర్ బాంబే ఆడిషన్స్ టైంలో తనకు చెప్పిన విషయాన్ని వెల్లడించింది.‘నీకు తెలుసు, నువ్వు బాగున్నావ్ కానీ ఒకే ఒక సమస్య ఏంటంటే..నువ్వు జెనరిక్ ఫేస్ (ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ లేని ముఖం) కలిగి ఉన్నావ్. నేను సాయం చేయలేను’ అని కాస్టింగ్ డైరెక్టర్ చెప్పినట్టు వెల్లడించింది.
అయితే మనపై మనకు నమ్మకముంటే ప్రతీ ఒక్కరూ మనల్ని ఇష్టపడాలని ఏమీ లేదని రకుల్ అన్నది. నన్ను నేను ప్రేమించుకున్నంత కాలం భ్రమలో ఉండను అంటూ చెప్పుకొచ్చింది. రకుల్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. హిందీలో ఆరు సినిమాలు, తెలుగులో ఒకటి, తమిళ్లో మూడు సినిమాలు చేస్తోంది.