హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ పేరిట డబ్బులు వసూలు చేస్తున్న ఆయన మాజీ భార్య రమ్య రఘుపతిపై కేసు నమోదైంది. ఆమెపై ఐదుగురు మహిళలు ఫిర్యాదు చేయగా.. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్, అనంతపూర్, హిందూపూర్‌లో రమ్య భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అయితే, అయితే, రమ్య వసూళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని నరేశ్ పేర్కొంటున్నారు.
రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె అయిన రమ్య రఘుపతిని ఎనిమిదేళ్ల ఏళ్ల క్రితం నరేశ్ వివాహం చేసుకున్నారు. కొంతకాలంగా దూరంగా ఉంటున్నారని సమాచారం. నరేశ్‌కు ఉన్న ఆస్తులను చూపుతూ.. ఈ ఆస్తి తనకే చెందుతుందని చెబుతూ ఆమె పలువురి వద్ద డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తున్నది. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.