Pawan Kalyan – Udayanidhi Stalin | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మదురైలో కేసు నమోదు అయ్యింది. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయానిధి స్టాలిన్‌ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను మదురైలోని కమిషనరేట్‌లో వాంజినాధన్ అనే న్యాయవాది కంప్లయింట్ ఇచ్చాడు. సనతాన ధర్మంపై ఉదయానిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను పవన్ వక్రీకరించి మాట్లాడాడని ఫిర్యాదులో తెలిపాడు. వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు.
అసలు ఏం జరిగిందంటే..
తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయానిధి స్టాలిన్ సనాతన ధర్మంపై గత ఏడాది సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సనాతన నిర్ములన సభలో ముఖ్య అతిథిగా హాజరైన స్టాలిన్ మాట్లాడుతూ.. మనం డెంగ్యూను, దోమలను, మలేరియాను లేదా కరోనాను వ్యతిరేకించలేం. వాటిని నిర్మూలించాల్సిందే. అలాగే సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలని ఉదయనిధి చెప్పారు. సనాతన అంటే సంస్కృతం నుంచి వచ్చిందని, ఇది సాంఘిక న్యాయం, సమానత్వాలకు, మహిళా సాధికారతకు వ్యతిరేకమని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. అయితే.. ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వగా, బీజేపీ నాయకులు అప్పుడు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు.
అయితే ఇదే వ్యాఖ్యలపై తాజాగా పవన్ కళ్యాణ్ స్టాలిన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు పరోక్షంగా స్టాలిన్‌కు వార్నింగ్ ఇచ్చారు. పవన్ మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని (Sanathan Dharma) ఎవరూ తుడిచిపెట్టలేరని, సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టాలనుకున్న వారే తుడిచిపెట్టుకు పోతారని పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ సభలో ప్రకటించారు. దీంతో ఈ వ్యాఖ్యలపై అటు తమిళనాడు డీఎంకే నేతలకు ఇటు జనసేన నేతలకు సోషల్ మీడియాలో వార్ జరుగుతుంది.
మరోవైపు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీ స్పందన ఏమిటి..? అని మీడియా ప్రతినిధులు ఉదయనిధి స్టాలిన్‌ను ప్రశ్నించగా.. ఆయన ఏక వాక్యంలో ముక్తసరిగా ‘ఏం జరుగుతుందో చూద్దాం’ అని వ్యాఖ్యానించారు.