Captain Miller | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) టైటిల్ రోల్లో నటించిన మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ కెప్టెన్ మిల్లర్ (Captain Miller). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రానికి అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ జనవరి 12న ప్రపంచవాప్తంగా 1600కుపైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. తమిళ్లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.
కాగా ఈ చిత్రం తెలుగు విడుదలకు సంబంధించిన ఇటీవలే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కెప్టెన్ మిల్లర్ తెలుగు రాష్ట్రాల్లో జనవరి 25న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో సురేశ్ ప్రొడక్షన్స్, ఏసియన్ సినిమాస్ గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా తెలుగు ట్రైలర్ ఎప్పుడనేది క్లారిటీ ఇచ్చారు. కెప్టెన్ మిల్లర్ తెలుగు ట్రైలర్‌ను రేపు సాయంత్రం 6 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు తెలియజేస్తూ కొత్త లుక్ విడుదల చేశారు. ధనుష్, శివరాజ్‌కుమార్, సందీప్ కిషన్.. ఫైరింగ్ మూడ్‌లో ఉన్న లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్ స్పూర్తితో తెరకెక్కిన ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ , టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్, నివేదితా సతీశ్, అమెరికన్ యాక్టర్, ఆర్ఆర్ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. సత్య జ్యోతి ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న కెప్టెన్ మిల్లర్ ఆడియో రైట్స్‌ను పాపులర్ మ్యూజిక్ లేబుల్ సరిగమ సొంతం చేసుకుంది.
తెలుగు ట్రైలర్ టైం ఫిక్స్..
The Wait is over..Much Awaited #CaptainMilIer Telugu Trailer is Releasing Tomorrow At 6PM 🔥
Telugu Release by @AsianCinemas_ and @SureshProdns 💥 @dhanushkraja #ArunMatheswaran @gvprakash @NimmaShivanna @sundeepkishan @priyankaamohan @SathyaJyothi pic.twitter.com/K72BKNy3u7
— BA Raju’s Team (@baraju_SuperHit) January 16, 2024
#CaptainMiller is set for a grand release in Andhra Pradesh and Telangana by @SureshProdns and @AsianCinemas_ 🔥
Releasing in theatres on Jan 25th!@dhanushkraja #ArunMatheswaran @gvprakash @NimmaShivanna @sundeepkishan @priyankaamohan @SathyaJyothi pic.twitter.com/GuZDej5Q5W
— Suresh Productions (@SureshProdns) January 12, 2024
కెప్టెన్ మిల్లర్ టీజర్..