Captain Miller | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం కెప్టెన్ మిల్లర్ (Captain Miller). అరుణ్ మథేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతోంది. ధనుష్ అభిమానులు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న టీజర్ అప్డేట్ రానే వచ్చింది. కెప్టెన్ మిల్లర్ టీజర్‌ను జులై 28న లాంఛ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ కౌంట్ డౌన్ మొదలైంది. మాగ్నమ్ ఓపస్ గ్లింప్స్ చూసేందుకు రెడీగా ఉన్నారా..? మరో రోజుల్లో అంటూ ట్వీట్ చేశారు మేకర్స్. ఈ మూవీలో కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్ స్పూర్తితో వస్తోన్న ఈ మూవీ మూడు పార్టులుగా రాబోతున్నట్టు ఇన్సైడ్ టాక్ నడుస్తుండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shivarajkumar), టాలీవుడ్ యాక్టర్ సందీప్ కిషన్, నివేదితా సతీశ్, అమెరికన్ యాక్టర్, ఆర్ఆర్ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
సత్య జ్యోతి ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న కెప్టెన్ మిల్లర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన కెప్టెన్ మిల్లర్ లుక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కెప్టెన్ మిల్లర్ ఆడియో రైట్స్‌ను పాపులర్ మ్యూజిక్ లేబుల్ సరిగమ సొంతం చేసుకుంది. కెప్టెన్ మిల్లర్ ఆడియో రైట్స్‌ను భారీ మొత్తానికి దక్కించుకున్నట్టు ఇన్సైడ్ టాక్.
The much awaited #CaptainMillerTeaser CONFIRMED for July 28.
|#Dhanush | #CaptainMiller| pic.twitter.com/tBAE8KQRI5
— Manobala Vijayabalan (@ManobalaV) July 24, 2023