Telugu Indian Idol Title Winner | ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ నిర్వహించిన ‘తెలుగు ఇండియన్ ఐడల్’కు తెరపడింది. ఎప్పుఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఫినాలే ఎపిసోడ్ శుక్రవారం రాత్రి నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇండియాలో ఎంతో పాపులర్ అయిన ‘ఇండియన్ ఐడల్’ను అదే పేరుతో ఆహా సంస్థ సింగింగ్ రియాలిటీ షోను నిర్వహించి.. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టాలెంటెండ్ సింగర్స్‌కు గొప్ప అవకాశాన్ని కల్పించింది. ప్రముఖ సింగర్ శ్రీ రామ్‌చంద్ర హోస్ట్‌గా చేస్తున్న ఈ షోలో సంగీత దర్శకుడు థమన్, నటి నిత్యామీనన్, సింగర్ కార్తిక్‌లు జడ్జ్‌లుగా వ్యవహరించారు. తాజాగా ఈ షో తుది దశకు చేరుకుంది. వాగ్దేవి, వైష్ణవి, ప్రణతి, జయంత్, శ్రీనివాస్‌లు ఫైనల్‌కు రాగా.. వీళ్ళలో ఎవరు మొదటి తెలుగు ఇండియన్ ఐడల్ టైటిల్ విజేతగా నిలుస్తారు అన్న సస్పెన్స్‌కు తెరపడింది. ఈ ఫినాలే ఎపిసోడ్‌కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా వచ్చి కంటెస్టెంట్లను తనదైన శైలిలో ప్రశంసిస్తూ ఈ ఎపిసోడ్‌కు కళ తీసుకొచ్చాడు. చిరుతో పాటుగా రానా, సాయిపల్లవిలు ‘విరాటపర్వం’ ప్రమోషన్లో భాగంగా ఎపిసోడ్‌కి వచ్చి సందడి చేశారు.
ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఫినాలే ఎపిసోడ్లో వాగ్ధేవి విజేతగా నిలిచింది. మెగాస్టార్ చేతుల మీదుగా ట్రోఫీని అందుకుని మొదటి తెలుగు ఇండియన్ ఐడల్‌గా నిలిచింది. ట్రోఫీతో పాటు వాగ్దేవికి రూ.10 లక్షల బహుమానం, గీతా ఆర్ట్స్ నుండి రానున్న సినిమాలో పాట పాడే అవకాశం కూడా వచ్చింది. మొదటి రన్నరప్‌గా నిలిచిన శ్రీనివాస్‌కు 3 లక్షలు, రెండవ రన్నరప్‌గా నిలిచిన వైష్ణవికి 2 లక్షల బహుమానం ఇచ్చారు. అంతేకాకుండా చిరంజీవి తన తదుపరి సినిమా ‘గాడ్‌ఫాదర్’లో వైష్ణవికి పాట పాడే అవకాశం ఇచ్చాడు. సింగర్ కార్తిక్ తను సంగీతం అందించనున్న నెక్స్ట్ సినిమాలో వాగ్దేవికి ఛాన్స్ ఇస్తున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా చిరుతో, వైష్ణవికి చెక్‌ను కూడా అందింపచేశాడు. ఈ ఎపిసోడ్లో నిత్యా మీనన్ పాట పాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. థమన్, కార్తిక్ పాటల ప్రదర్శన, శ్రీరామ్ చంద్ర నృత్య ప్రదర్శనతో షోను మరింత రంజింప చేశారు.
Tana paatatho andari hrudayalanu gelichi First #TeluguIndianIdol title winner ga nilichina, Vagdevi's wonderful winning moments#MegaFinale streaming now
▶️ https://t.co/7sBwsfokiA pic.twitter.com/gHy5DWdvJm— ahavideoin (@ahavideoIN) June 17, 2022