Super star Rajinikanth | సూపర్ స్టార్ రజనీకాంత్‌కు తమిళంలో ఎంత క్రేజ్ ఉందో తెలుగులోనూ అంతే క్రేజ్ ఉంది. కోలీవుడ్‌లో ఆయన సినిమాలకు ఎలాంటి సెలబ్రెషన్స్ జరుగుతాయో.. ఇక్కడ కూడా అదే రేంజ్లో సెలబ్రెషన్స్ జరుగుతాయి. రజనీ సినిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు సినీ సెలెబ్రిటీల సైతం ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం ఈయన నెల్సన్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే చిత్రబృందం రిలీజ్ చేసిన పోస్టర్లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి.
ఈ సినిమా తర్వాత రజనీ లైకా ప్రొడక్షన్ సంస్థలో వరుసగా రెండు సినిమాలు చేయనున్నాడు. అందులో ఒక సినిమాకు ‘డాన్’ ఫేం శిబి చక్రవర్తి దర్శకత్వం వహించనుండగా, మరొకటి రజనీ కుమార్తే ఐశ్వర్య దర్శకత్వం వహిస్తుంది. దీనికి ‘లాల్ సలాం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అయితే ఈ చిత్రంలో రజనీ గెస్ట్ రోల్లో మాత్రమే కనిపించనున్నాడు. అతిథి పాత్రే అయినా రజినీ రోల్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ ప్రారంభించనుంది.
కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా బాలీవుడ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, రాజ్ కుమార్ రావు నటించిన ‘కాయ్ పో చే!’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారట, స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజకీయ అంశాలతో పాటు మతపరమైన వివాదాస్పద సన్నివేశాలు కూడా ఉన్నాయి. తమిళ నేటివిటీకి తగ్గట్లు కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారటని కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రానికి ఏ.ఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చుతున్నాడు.