కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ నటించిన ప్రతిష్టాత్మక పానిండియా చిత్రం ‘వృషభ’. నందకిశోర్ దర్శకుడు. శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె.పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్‌సింగ్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా నిర్మాతలు. ఈ నెల 25న గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ చిత్రం తెలుగులో గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ చిత్ర పంపిణీదారుడు బన్నీవాస్ మాట్లాడుతూ ‘ ‘వృషభ ఓ విజువల్ వండర్. కింగ్ ఎపిసోడ్ వచ్చినప్పట్నుంచీ సినిమా మరోస్థాయికి వెళ్తుంది.
ఓ 45 నిమిషాల పుటేజ్ చూశాను. నిజంగా చాలా బావుంది. దర్శకుడు నందకిశోర్ గ్రాండియర్‌గా సినిమాను మలిచారు. మోహన్‌లాల్ నట విశ్వరూపం ఈ సినిమా. ‘ఆయ్’, ‘క’ సినిమాలతో విజయాలను అందుకున్న నయన్సారిక ఈ సినిమాతో హ్యాట్రిక్ అందుకోవాలి. పనిచేసిన అందరికీ మంచిపేరు తెచ్చే సినిమా ఇది.’ అని తెలిపారు. తెలుగు తెరకు పరిచయం అవుతున్నందుకు హీరో సమర్జీత్ లంకేశ్ ఆనందం వెలిబుచ్చారు. మోహన్‌లాల్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు కథానాయిక నయన్ సారిక. అలీ, బలగం సంజయ్ కూడా మాట్లాడారు.