మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన ఇంట ఎంత సందడి వాతావరణం నెలకొందో మనం చూశాం. ఇంటి బయట అభిమానుల హంగామా, ఇంట్లో మెగా ఫ్యామిలీ సందడి.. వీటితో ఆ ప్రాంగణం అంతా సందడిగా మారింది. వేడుకలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నాగబాబు, మెగాస్టార్ కొడుకు-కోడలు రామ్ చరణ్, ఉపాసన కామినేని, కూతుళ్లు సుస్మిత, శ్రీజ వారి ఫ్యామిలీ, చిరంజీవి అక్కాచెల్లెలు, మెగా మేనల్లుళ్లు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ మెగా హీరో వరుణ్ తేజ్ నిహారిక ఆమె భర్త హాజరయ్యారు.
నిర్మాత అల్లు అరవింద్ కూడా సతీసమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే మెగా ఫ్యామిలీకి చెందిన బన్నీడుమ్మా కొట్టాడు. అతని గైర్హాజరుపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. మెమోరబుల్ ఈవెంట్‌కి బన్నీ ఎందుకు రాలేకపోయాడని ఆరాలు తీస్తుండగా, కొందరు ఆయన పుష్ప షూటింగ్‌తో బిజీగా ఉండడం వలన రాలేకపోయారు అని చెప్పుకొస్తున్నారు.
బన్నీ రాలేకపోయిన ఆయన కుటుంబాన్నిఅయిన పంపొచ్చు కదా అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి బన్నీ గైర్హాజరు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక చిరంజీవి ఇంట జరిగిన సెలబ్రేషన్స్‌కి సంబంధించి వీడియోవిడుదల కాగా, ఇది మెగా ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అంతేకాక సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.