న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీ(Sonia Gandhi) తన ఆత్మకథను పుస్తక రూపంలో తీసుకువస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ బుక్‌ను హార్పర్‌కొల్లిన్స్ అనే సంస్థ ప్రచురించనున్నది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా జీవితకథను తాము ప్రచురించనున్నట్లు హార్పర్‌కొల్లిన్స్ ఇవాళ తన ఎక్స్ అకౌంట్ ద్వారా ప్రకటించింది. బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్ బై సోనియా గాంధీ బుక్‌లో సోనియా తన స్వీయ అనుభవాలను రాశారు. ఈ ఏడాది నవంబర్ 10వ తేదీన ఆ బుక్‌ను పబ్లిష్ చేయనున్నారు. సోనియా గాంధీ ఆత్మకథ ఈనాటి తరం ఎదురుచూస్తున్న రాజకీయ జీవితకథ అని పబ్లిషర్స్ తెలిపారు. ప్రేమ, ఐడెంటిటీ, తన విధులకు చెందిన వ్యక్తిగత, నాటకీయత కూడిన పుస్తకమని హార్పర్‌కొల్లిన్స్ పేర్కొన్నది.
ఈ బుక్ ప్రచురణపై వివాదం నెలకొన్నది. బిలాంగింగ్ బుక్‌ను ప్రచురించేందుకు పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ ఇండియా తప్పుకున్నది. సోనియా జీవితకథకు చెందిన బుక్‌లో కొన్ని ఎడిటోరియల్ సవాళ్లు ఎదురయ్యాయని, దాని వల్ల ఆ బుక్‌ను పబ్లిష్ చేయలేకపోతున్నట్లు పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ పేర్కొన్నది.
HarperCollins India will publish Belonging: A Journey of Love by Sonia Gandhi. The long-awaited memoir will be published in India on 10 November 2026.
One of the most anticipated political memoirs of our time, Belonging is a dramatic and deeply personal story of love, identity,… pic.twitter.com/cNWuNRgXXP
— HarperCollins (@HarperCollinsIN) September 4, 2026