Pottel | మల్లేశం, వకీల్‌సాబ్ సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది టాలీవుడ్ భామ అనన్య నాగళ్ల. ఈ బ్యూటీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం పొట్టేల్ (Pottel). యువ చంద్ర కృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘బంధం రేగడ్’, ‘సవారీ’ ఫేం సాహిత్ మోత్ఖురి డైరెక్ట్ చేస్తున్నాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి తాజాగా బుజ్జి మేక (Bujji meka song) లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను శేఖర్ చంద్ర కంపోజిషన్‌లో కాలభైరవ పాడాడు.
ఎమోషనల్‌గా సాగుతున్న ఈ పాట సినిమాకు హైలెట్‌గా నిలువనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబింబే బోనాల పండుగను హైలెట్ చేస్తున్న లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. వేడుకల్లో అమ్మవారి ముందు పొట్టేల్‌ను బలి ఇవ్వడం, జోగిని రంగం ప్రదర్శించడం లాంటి విషయాలను చూపిస్తున్న పోస్టర్ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెబుతోంది.
పొట్టేల్ చిత్రాన్ని ఎన్ఐఎస్ఏ ఎంటర్టైనర్మెంట్ బ్యానర్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రగ్యా సన్నిది క్రియేషన్స్ బ్యానర్‌పై సురేష్ కుమార్ సడిగే సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరీ, నీల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
బుజ్జిమేక సాంగ్..