సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బుజ్జీ ..ఇలారా’. గరుడవేగ అంజి దర్శకుడు. చాందిని అయ్యంగార్ కథానాయిక. సోమవారం టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. ధన్‌రాజ్ పాత్ర కొత్త పంథాలో ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నది’ అని చెప్పారు. ‘ధన్‌రాజ్‌ను ఓ కమెడియన్లా కాకుండా విభిన్నంగా చూపించాలనే ఉద్ధేశ్యంతో ఈ కథ రాశాను. ఈ సినిమా కోసం ధన్‌రాజ్ ఎన్నో సినిమాల అవకాశాల్ని పోగొట్టుకున్నాడు. ఆయన పాత్ర అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది’ అని జి.నాగేశ్వరరెడ్డి తెలిపారు. నలభైఐదు రోజుల్లో చిత్రీకరణ పూర్తయిందని, ఈ సినిమా ద్వారా తనలోని కొత్తకోణాన్ని చూస్తారని ధన్‌రాజ్ తెలిపారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే: జి.నాగేశ్వరరెడ్డి, నిర్మాణ సంస్థలు: జి.నాగేశ్వరరెడ్డి టీమ్ వర్క్, ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్, సంభాషణలు: భాను, చందు, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: గరుడవేగ అంజి.