Buchibabu Father | ఉప్పెన సినిమా ఫేం దర్శకుడు బుచ్చిబాబు సనా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తండ్రి పెదకాపు(Pedha Kapu) శుక్రవారం ఉదయం మృతి చెందారు. పెదకాపు మరణంతో బుచ్చిబాబు కుటంబం శోకసముద్రంలో మునిగిపోయింది. ఈరోజు సాయత్రం పెదకాపు స్వగ్రామం అయిన యు.కొత్తపల్లిలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక బుచ్చిబాబు తండ్రి మరణం పట్ల ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మరోవైపు టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకుమార్ కూడా పెదకాపుకు నివాళులు అర్పించాడు.
స్టార్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మారారు. మొదటి సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్తో తన రెండవ సినిమాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తున్నాడు. ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీ రోల్ చేస్తున్నారు.
Director Buchi Babu father no more 🙏
RIP pic.twitter.com/M8sFPVaIya— Sreedhar Sri (@SreedharSri4u) May 31, 2024