Buchi Babu | సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తన తొలి సినిమాగా ఉప్పెన అనే చిత్రం చేశాడు. ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఉప్పెన చిత్రంతో బుచ్చిబాబు టాలెంట్ ఏంటో అందరికి అర్ధమైంది. చెర్రీ కూడా బుచ్చిబాబు పనితీరుకి ఫిదా అయి ఆయనతో కలిసి ఇప్పుడు పెద్ది అనే చిత్రం చేస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ గ్లింప్స్ విడుదల కాగా, ఇది చూసి అంతా అవాక్కయ్యారు. గ్లింప్స్‌తోనే అందరి దృష్టినీ తన వైపు తిప్పుకొన్నాడు. పెద్ది సినిమాతో బుచ్చిబాబు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటున్నారు. ఇక బుచ్చి. ‘పెద్ది’ తరవాత బుచ్చి ఏం చేయబోతున్నాడు? అనే చర్చ కూడా నడుస్తుంది.
ఈ క్రమంలో ‘పెద్ది’ అయ్యాక మహేష్ బాబుతో బుచ్చిబాబు ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని ఫిలిం నగర్లో జోరుగా చర్చ నడుస్తుంది. గతంలో బుచ్చిబాబు.. మహేష్ నటించిన వన్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఆ సమయంలో మహేష్ బాబుతో మంచి సాన్నిహిత్యం ఏర్పడిందట. ఈ క్రమంలో ఉప్పెన తర్వాత ఓ సారి మహేష్ బాబుని కలిసాడట. అప్పుడు మహేష్ బాబు.. ‘మంచి కథ ఉంటే చెప్పు, చేద్దాం’ అని మాట ఇచ్చాడట. దాంతో మహేష్ కోసం మంచి కథ సిద్ధం చేసే పనిలో బుచ్చి ఉన్నట్టు తెలుస్తుంది. మహేష్ కోసం బుచ్చిబాబు యాక్షన్ డ్రామా సిద్ధం చేసుకుంటున్నాడని, ఇందులో మహేష్‌ని నెక్ట్స్ లెవల్లో చూపించే ప్రయత్నాల్లో బుచ్చిబాబు ఉన్నాడని ఫిల్మ్‌నగర్ టాక్.
ఇక బుచ్చిబాబు ప్రస్తుతం చేస్తున్న పెద్ది చిత్రం రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రాసుకున్న ఫిక్షనల్ స్టోరీ అని అంటున్నారు. కోవిడ్ టైమ్‌లోనే ఈ కథ రెడీ చేసుకున్నానని చెప్పిన బుచ్చిబాబు సుకుమార్ వల్లే రామ్ చరణ్‌కు కథ వినిపించే ఛాన్స్ వచ్చిందని అన్నారు. ఇక టీజర్లో సూపర్ సక్సెస్ అయిన క్రికెట్ షాట్ ..ఫైట్ మాస్టర్ నవకాంత్ డిజైన్ చేశారని, క్రెడిట్ అంతా అతనికే దక్కాలన్నారు. రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ‘పెద్ది’ ఐడియా ముందుగా ఎన్టీఆర్కే చెప్పాడు బుచ్చిబాబు. కాని ఎందుకో కుదరలేదు.