మంగళవారం 24 నవంబర్ 2020
Cinema - Oct 27, 2020 , 18:56:45

ఫ్లోర‌ల్ డిజైన్ డ్రెస్ లో శ్ర‌ద్దాక‌పూర్

ఫ్లోర‌ల్ డిజైన్ డ్రెస్ లో శ్ర‌ద్దాక‌పూర్

గ‌తేడాది సాహో చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కులను అల‌రించింది బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్దాక‌పూర్. సోష‌ల్ మీడియా ద్వారా అంద‌రినీ ప‌లక‌రించే ఈ భామ తాజాగా ఫ్లోర‌ల్ డిజైన్ డ్ డ్రెస్ లో మెరిసిపోతుంది. జుహులోని న‌టుడు, నిర్మాత నిఖిల్ ద్వివేది కార్యాల‌యానికి వెళ్లిన స‌మ‌యంలో అక్క‌డే ఉన్న కెమెరామెన్స్  శ్ర‌ద్దాక‌పూర్ ను త‌మ కెమెరాల్లో బంధించారు. సంప్ర‌దాయ‌ ఫ్లోర‌ల్ ఫ్రింటెడ్ డిజైన్ పంజాబీ డ్రెస్‌లో శ్ర‌ద్దా‌క‌పూర్ ఫొటోలకు పోజివ్వ‌గా..ఆ స్టిల్స్ నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

మ‌రోవైపు ర‌ణ్ వీర్ సింగ్ అజ్‌టెక్ పైజామాలో రౌండ్ టోపీ పెట్టుకుని..చేతిలో జేబీఎల్ స్పీక‌ర్ ప‌ట్టుకుని..చైన్ క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని ముంబై ఎయిర్ పోర్టులో న‌డుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.