Gam Gam Ganesha | బేబి సినిమాతో సూపర్ హిట్టందుకున్నాడు టాలీవుడ్ యువ హీరో ఆనంద్ దేవర కొండ (Anand Deverakonda). ఈ యువ నటుడి కాంపౌండ్ నుంచి వస్తున్న మరో చిత్రం ‘గం..గం..గణేశా’ (Gam Gam Ganesha). మేకర్స్ ఇటీవలే లాంఛ్ చేసిన గం..గం..గణేశా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
కాగా యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ బృందావనివే సాంగ్ ప్రోమోను లాంఛ్ చేశారు. ఆ పిల్ల నీ మీద ఏ ఫీలింగ్.. లేదు.. లేదు అని మీరో అనుకుంటుంటే.. ఉన్నది అంటోంది హీరోయిన్. ఇద్దరి మధ్య సాగే సూపర్ ట్రాక్ ఇటీవలే మేకర్స్ కిక్ ఇచ్చే ఫన్ లోడింగ్ .. త్వరలో అంటూ సినిమా పాత్రలు ఎలా ఉండబోతుందో హింట్ ఇస్తూ డిజైన్ చేసిన మోషన్ పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతూ.. సినిమాపై అంచనాలు పెంచేస్తోంది.
యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న గం..గం..గణేశా మూవీని హై-లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ఉదయ్ శెట్టి డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. సినిమా సినిమాకు కొత్తదనంతో కూడిన కథలను ఎంపిక చేసుకుంటూ సక్సెస్ ట్రాక్‌లో వెళ్తున్నాడు ఆనంద్ దేవరకొండ. బేబితో సూపర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆనంద్ దేవరకొండ గం గం గణేశాతో ఎలాంటి వినోదాన్ని అందిస్తాడో చూడాలి మరి.
బృందావనివే సాంగ్ ప్రోమో..
గం..గం..గణేశా మోషన్ పోస్టర్..
Kick-ass fun loading super soon.. 😉🍿
Meanwhile here’s the motion poster of #GamGamGanesha for you all 💥@ananddeverkonda @udaybommisetty @HylifeE @chaitanmusic #KedarSelagamsetty @thisisvamsik @saregamasouth @GskMedia_PR @Ticket_Factory #GGG pic.twitter.com/mU65yokTZx
— BA Raju’s Team (@baraju_SuperHit) September 11, 2023
గం..గం..గణేశా ఫస్ట్ లుక్ ..
Presenting the first look of @ananddeverkonda from #GamGamGanesha!
See you soon!@udaybommisetty @HylifeE @chaitanmusic #KedarSelagamsetty @thisisvamsik @GskMedia_PR @Ticket_Factory #GGG pic.twitter.com/7JWMGsooA9— Hylife Entertainments (@HylifeE) September 9, 2023
గం..గం..గణేశా టైటిల్ పోస్టర్..
One more album this year. Title Poster of #GamGamGanesha
Starring @ananddeverkonda and directed by @theudayshetty @HylifeE pic.twitter.com/nnWQsZiogg— Chaitan Bharadwaj (@chaitanmusic) February 7, 2022
గం..గం..గణేశా పూజా కార్యక్రమం..
#GamGamGanesha Pooja ceremony..🙂
Starring @ananddeverkonda and directed by @theudayshetty
Hylife Entertainments pic.twitter.com/b1RTgor74D
— Chaitan Bharadwaj (@chaitanmusic) February 7, 2022