Bro Movie Trailer | రెండు వారాల్లోపే విడుదల కాబోతున్న బ్రో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒక్కొక్కటిగా చక చక పూర్తయిపోతున్నాయి. తాజాగా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. 2 గంటల 15 నిమిషాల క్రిస్పీ రన్ టైమ్ ను మేకర్స్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. జూలై 28న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో తిరుగులేని అంచనాలు నెలకొన్నాయి. పైగా మామ అల్లుళ్లు ఒకే సారి వెండితెరపై కనిపించనుండటంతో వీర లెవల్లో హైప్ ఏర్పడింది. పి. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ సిత్తం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక పాటలు మెల్లిమెల్లిగా ఎక్కేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అప్డేట్ ను మేకర్స్ రివీల్ చేశారు.
ఎప్పుడెప్పుడా అని పవన్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చేస్తున్న ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. జూలై 21న ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత వివేక్ కూచిబొట్ల తాజాగా ఓ ప్రెస్ మీట్ లో వెల్లడించాడు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకపై మేకర్స్ తర్జన భర్జన అవుతున్నారు. ముందుగా జూలై 24న అనుకున్నా.. పవన్ వారాహితో బిజీగా ఉండటంతో అదే డేట్ ఫిక్స్ అని కన్ఫర్ చేయలేకపోతున్నారు. దీనిపై మరో రెండు, మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఫాంటసీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించాడు. త్రివిక్రమ్ తెలుగు నేటివిటీకి తగ్గట్లు పలు మార్పులు చేర్పులు చేశాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా బ్యానర్ పై వివేక్ కూచిబొట్ల నిర్మించాడు. ఈ సినిమాకు భారీ రేంజ్ లో బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. బయటకు లీక్ కావట్లేదు కానీ అంతర్గతంగా ఈ సినిమా బిజినెస్ హాట్ కేక్ లా జరుగుతోందని ఇన్ సైడ్ టాక్. ఒక్క నైజామ్ హక్కులే మైత్రికి ముప్పై రెండు కోట్లకు అమ్మారంటే ఏ రేంజ్ లో ఈ సినిమాపై క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొత్తంగా ఈ సినిమాకు వంద కోట్లకు పైగానే బిజినెస్ జరుగుతుందని భోగట్టా.