Bro Movie | పవన్ కళ్యాణ్ లైనప్‌లో ముందుగా విడుదలయ్యేది ‘బ్రో’ సినిమానే. మరో నాలుగు వారాల్లో రిలీజయ్యే ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ గంపెడంత ఆశలే పెట్టుకున్నారు. దానికి తోడు మోషన్ పోస్టర్లు, టీజర్లు గట్రా సినిమాపై ఎక్కడలేని హైప్‌ను క్రియేట్ చేశాయి. పి.సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ సిత్తమ్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతుంది. పవన్‌తో పాటు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఆయన సరసన కేతిక శర్మ నటిస్తుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్యాచ్ వర్క్‌ను పూర్తి చేసుకుంటుంది. పాటలు మినహా టాకీ పార్టును ఇప్పటికే కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఓ సాంగ్ షూట్ కోసం ఫారిన్‌కు వెళ్లింది.
సాయిధరమ్ తేజ్, కేతిక శర్మలపై ఫారిన్లో ఓ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఒక బెంచీపై ఫోన్ చూస్తూ కూర్చున్న సాయిధరమ్ తేజ్.. ఆయన ముందు నుంచి కాస్త చిరాకు ఫేస్‌తో నడుస్తున్న కేతిక.. ఇలా సాంగ్‌లోని ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. ఈ పాట కోసం థమన్ ఓ క్యాచీ ట్యూన్‌ను డిజైన్ చేసినట్లు ఇన్సైడ్ టాక్. పేరుకు తమిళ రీమేకే అయినా.. త్రివిక్రమ్ తెలుగులో పెద్ద మొత్తంలో చేంజేస్ చేశాడని భోగట్టా. అంతేకాకుండా త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ కామెడీని కూడా యాడ్ చేసినట్లు తెలుస్తుంది. పీపుల్ మీడియా బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.