Sai Dharam Tej First Look Poster | ‘విరూపాక్ష’తో తిరుగులేని కంబ్యాక్ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం మేనమామ పవన్‌తో కలిసి ‘బ్రో’ మూవీ చేస్తున్నాడు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. నిన్న మొన్నటి వరకు పెద్దగా అంచనాల్లేని ఈ సినిమాపై నాలుగు రోజుల క్రితం రిలీజైన పోస్టర్ ఎక్కడలేని హైప్ తీసుకొచ్చింది. ఫస్ట్‌లుక్ పోస్టరే ఈ రేంజ్లో దింపితే సినిమా ఇంకా ఏ లెవల్లో ఉంటుందన్న ఊహే మెగా అభిమానుల్లో జోష్ నింపుతుంది. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లతో సినిమాపై మంచి అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా మేకర్స్ సాయిధరమ్ తేజ్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ మార్కండేయులు(మార్క్)గా కనిపించనున్నాడు. వైట్ అండ్ వైట్ లుక్‌లో సాయి ధరమ్ ఫస్ట్‌లుక్ పోస్టర్ అదిరిపోయింది. ఈ సినిమాకు త్రివిక్రమ్ తెలుగు నేటివిటీకి తగ్గట్లు పలు మార్పులు చేర్పులు చేస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా సంస్థ నిర్మిస్తుంది.
ఒక యాక్సిడెంట్లో చనిపోయిన ఓ వ్యక్తి.. తాను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని, దానికి మూడు నెలలు సమయం కావాలని తననీ పైకి తీసుకెళ్లడానికి వచ్చిన దేవుడిని ఓ వరం అడుగుతాడు. దానికి దేవుడు ఒప్పుకోవడమే కాకుండా ఆ మూడు నెలలు ఇక్కడే ఉండి ఆ వ్యక్తితో ప్రయాణిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చనిపోయిన వ్యక్తి తాను అనుకున్న పనులను పూర్తి చేశాడా? అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది.
MARK has set foot 🔥
Presenting @IamSaiDharamTej as ‘MARKANDEYULU’ with #IntroducingMARK from #BroTheAvatar 💥
▶️ https://t.co/eXKTE2yu5y@PawanKalyan @thondankani @MusicThaman @vishwaprasadtg @vivekkuchibotla @bkrsatish @TheKetikaSharma @NavinNooli @ZeeStudios_… pic.twitter.com/NpEUR783vd— People Media Factory (@peoplemediafcy) May 23, 2023