Nandamuri Chaitanya Krishna | గత ఏడాది నందమూరి ఫ్యామిలీ నుంచి మరో నటుడు సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. దివంగత నటుడు ఎన్టీఆర్ కొడుకు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ (Nandamuri Chaitanya Krishna) హీరోగా నటించిన తాజా చిత్రం ‘బ్రీత్’ (Breathe). వైద్యో నారాయణో హరి అనేది ఈ సినిమా ఉపశీర్షిక. వంశీకృష్ణ ఆకెళ్ల ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు రూ.10వేల కలెక్షన్లు కూడా రాకపోవడం విశేషం. ఇక సినిమా విడుదల అయ్యాక మూవీపౌ ట్రోల్స్ కూడా చేశారు. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుంది.
ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో మార్చి 8 నుంచి ఈ సినిమా అందుబాటులోకి రాసున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆసుపత్రిలో చేరతారు. ఈ క్రమంలో ఆయన్ని చంపడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తారు. వాళ్ల నుంచి ఒక సామాన్య యువకుడు ముఖ్యమంత్రిని ఎలా కాపాడాడు అనేది సినిమా స్టోరీ. ఈ సినిమాను బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్‌పై నందమూరి జయకృష్ణ తెరకెక్కించారు. సెంజలియా హీరోయిన్గా నటించింది.
The sensational movie #Breathe is coming your way in just 2 days! 🔥🎬 pic.twitter.com/qrXbUjcLJ9
— ahavideoin (@ahavideoIN) March 6, 2024