Tamannah-Vijay| సినీ సెలబ్రిటీల ప్రేమ, పెళ్లి, బ్రేకప్‌ల వ్యవహారాలు ఎప్పుడు వార్తలలో నిలుస్తుంటాయి. వారు ఎప్పుడు ప్రేమలో పడతారో, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో, ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారో చెప్పడం చాలా కష్టం. ఇటీవలి కాలంలో ఘాడంగా ప్రేమించుకున్న చాలా సెలబ్రిటీ జంటలు ఊహించని విధంగా విడాకులు తీసుకొని అందరికి షాకులు ఇచ్చారు. అయితే త్వరలో పెళ్లి బంధంతో తమన్నా- విజయ్ వర్మ ఒక్కటి కాబోతారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో వారిద్దరి బ్రేకప్ కి సంబంధించిన వార్తలు అభిమానులని ఆందోళనకి గురి చేస్తున్నాయి.
విజయ్ వర్మతో తమ బంధాన్ని గుట్టుగా ఉంచిన తమన్నా ఆ తర్వాత ఓపెన్ అయింది. కలిసి ఈవెంట్స్‌లో దర్శనం ఇవ్వడం, మీడియా ముందు ఫొటోలకి పోజులివ్వడం వంటివి చేస్తూ వచ్చారు. అయితే గత కొంత కాలంగా వీరిద్దరు కలిసి కనిపించడం లేదని, విడిపోవాలని నిర్ణయించుకున్నారని ఇన్సైడ్ టాక్. తమన్నా ఒంటరిగా కలిసి కనిపిస్తున్న నేపథ్యంలో తమన్నా- విజయ్ వర్మ లవ్‌కి బ్రేకప్ పడిందని బాలీవుడ్ మీడియా జోరుగా ప్రచారం చేస్తుంది. మరి దీనిపై తమన్నా కాని లేదంటే విజయ్ కాని స్పందిస్తుందా అనేది చూడాలి.
ఇంకొంత కాలం తమన్నా, విజయ్ వర్మలు కనుక వేడుకలు, ఇతరత్రా చోట్ల కలిసి కనిపించకపోతే అందరు కూడా వారిద్దరి రిలేషన్ బ్రేకప్ అయిందని డిసైడ్ అయిపోతారు. ఈ లోపే ఎవరైన స్పందిస్తే బాగుంటుంది. ఇక ఇదిలా ఉంటే తమన్నా గతంలో మాదిరిగా సినిమాలు చేయకపోయిన అడపాదడపా మాత్రం కొన్ని సినిమాలలో మెరుస్తూ రచ్చ చేస్తుంది. మహిళా అఘోరాగా తమన్నా తొలిసారిగా నటించిన ఓదెల 2 ఇటీవలే కుంభమేళాలో టీజర్ లాంచ్ జరుపుకుంది. సంపత్ నంది రచన, నేతృత్వంలో నిర్మించిన ఈ హారర్ థ్రిల్లర్ చిత్రం తమన్నాకి మంచి బ్రేకప్ అవుతుందని భావిస్తుంది.తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించిన తమన్నా మంచి క్రేజ్ అందుకుంది. తెలుగు స్టార్ హీరోల అందరితోనూ నటించి మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది. తమన్నా ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సరీస్‌ల్లోనే ఎక్కువుగా నటిస్తూ ప్రేక్షకులని అలరిస్తుంది. తన తోటి హీరోయిన్స్ కాజల్, నయనతార, రకుల్, సమంత వంటి వారంతా పెళ్లి చేసుకోగా తమన్నా మాత్రం బ్యాచిలర్‌గానే ఉంది.