Actress Mouni Roy | నాగిని సీరియల్‌తో హిందీ నాట తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది మౌనీ రాయ్. బుల్లితెర ప్రేక్షకులకు హాట్ ఫేవరెట్ అయిపోయింది. ఎంతలా అంటే నాగిని సీరియల్‌కు సీక్వెల్ చేసేంతలా. ఇండియన్ టెలివిజన్ హిస్టరీలోనే ఒక సీరియల్‌కు సీక్వెల్ తెరకెక్కడం బహుశా ఈ సీరియల్‌కే దక్కిందేమో. ఇక ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌లోనూ ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా గడుపుతుంది. గతేడాది వచ్చిన బ్రహ్మస్త్రలో ప్రతినాయకురాలి పాత్రలో మౌనీ రాయ్ అద్భుతమైన నటనను కనబర్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
మౌనీ రాయ్ తాను తొమ్మిది రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నట్లు తెలిపి అందరికీ షాక్ ఇచ్చింది. కొన్ని రోజుల కిందట ఆమె అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు హిందీ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే తాను ఎందుకు హాస్పిటల్లో చేరిందనే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఆమెకు సంబంధించిన హెల్త్ అప్డేట్స్ కూడా పెద్దగా బయటకు రాలేదు. ఇక ఇప్పుడు స్వయంగా ఆమెనే తన హెల్త్ గురించి చెప్పింది. తొమ్మిదిరోజుల పాటు హస్పిటల్లో ఎంతో బాధ అనుభవించానని, ఇప్పుడిప్పుడు ఆరోగ్యం కాస్త కుదుటపడుతుందని వెల్లడించింది.
హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు స్టాఫ్ తననెంతో జాగ్రత్తగా చూసుకున్నారంటూ వాళ్లకు కృతజ్ఞతలు తెలిపింది. ఇక చికిత్స జరుగుతున్న టైమ్‌లో తన భర్త నిరంతరం తనకు తోడుగా ఉన్నాడని, ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పుకుంది. మరి ఇంతకీ తను ఎందుకు తొమ్మిదిరోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చిందో చెప్పలేదు. ఈ పోస్ట్‌పై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మౌనీ రాయ్ ది వర్జిన్ ట్రీ అనే సినిమా చేస్తుంది. సిద్ధాంత్ కుమార్ సచ్దేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, సన్నీ సింగ్, పాలక్ తివారీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.