Brahmanda Movie | సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మాండ’. మమత ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై దాసరి సురేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాంబాబు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘తెలంగాణ జానపద కళారూపం ఒగ్గు కథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.
ఒగ్గు కళాకారుల నేపథ్యంలో వస్తున్న తొలి సినిమా ఇదే. డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుంది. ఆమని నటన ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అన్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే భావోద్వేగభరితమైన సినిమా ఇదని హీరో బన్నీ రాజు అన్నారు. జయరామ్, కొమరం బన్నీ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కాసుల కార్తీక్, సంగీతం: వరికుప్పల యాదగిరి, మాటలు: రమేష్ రాయి, జీఎస్ నారాయణ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాంబాబు.