Brahma Anandam బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మ ఆనందం’(Brahma Anandam). వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆర్వీఎస్ నిఖిల్ దర్వకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.
నేడు ఈ సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ టీజర్ వేడుకలో బ్రహ్మి మాట్లాడుతూ.. ఈ మధ్య మొహం చూడగానే నవ్వు తెప్పించే వారిలో వెన్నెల కిషోర్ ఉన్నాడు. వెన్నెల కిషోర్ తెరపై కనిపిస్తే చాలు ఆటోమేటిక్‌గా నవ్వు వస్తుంది. నా వారసత్వాన్ని కొనసాగించే వారిలలో వెన్నెల కిషోర్ ఒక్కడు. అంతా సరదాగా నటిస్తాడు కిషోర్ అంటూ బ్రహ్మి చెప్పుకోచ్చాడు.
నా లెగసీ కంటిన్యూ చేసే కమెడియన్ కిషోర్ – బ్రహ్మానందం#Brahmanandam #VennelaKishore pic.twitter.com/4LncHstTJi
— Filmy Focus (@FilmyFocus) January 16, 2025