Brahma Anandam | కామెడీ కింగ్ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘బ్రహ్మ ఆనందం’(Brahma Anandam). ఈ సినిమాకు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించగా.. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటించాడు. మసూద లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు బ్రహ్మానందం, రాజా గౌతమ్ నటనకు ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంద. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ఈ చిత్రం మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు నిర్వహాకులు ప్రకటించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. బ్రహ్మ అలియాస్ బ్రహ్మానందం (రాజా గౌతమ్) ఒక రంగస్థల నటుడు. చిన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోయి, స్వార్థంతో కూడిన జీవితాన్ని గడుపుతూ, నాకు నేనే సరిపోతాను అన్నట్లుగా ఒంటరిగా బతుకుతుంటాడు. ఎప్పటికయిన పెద్ద నటుడు అవ్వాలనే కోరికతో జీవిస్తుంటాడు. అయితే తన కలలను సాకారం చేసుకునే క్రమంలో తన గురువు సాయంతో దిల్లీలో జరగనున్న కళారంగ్ మహోత్సవంలో నాటకం వేసే అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడు. అయితే ఈ నాటకంలో పాల్గోనాలి అంటే రూ.6 లక్షలు చెల్లించాలని నిర్వాహకుడు షరతు పెడతాడు. దీంతో ఆ డబ్బు ఎలా అయిన సంపాదించాలని బ్రహ్మ ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు. ఇదే టైంలో వృద్ధాశ్రమంలో ఉంటున్న తన తాత మూర్తి అలియాస్ ఆనంద రామ్మూర్తి (బ్రహ్మానందం) బ్రహ్మను కలుస్తాడు.
కోదాడ సమీపంలో తన పేరు మీద ఆరు ఎకరాల భూమి ఉందనీ, తాను చెప్పిన విధంగా చేస్తే ఆ ఆస్తిని తనకు ఇస్తానని బ్రహ్మకు చెబుతాడు. ఈ మాటలతో బ్రహ్మను గ్రామానికి తీసుకెళ్తాడు మూర్తి. అక్కడికి చేరిన తర్వాత ఏం అయ్యాంది? మూర్తి నిజంగా ఆ భూమిని బ్రహ్మకు ఇచ్చాడా? దానికి అతను విధించిన నిబంధనలు ఏమిటి? మూర్తి వృద్ధాశ్రమంలో ఎందుకు ఉంటున్నాడు? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.