ప్రఖ్యాత నటుడు బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకుడు. స్వధర్మ్ ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా సినిమాలోని ఓ మాస్ సాంగ్‌ని ఆదివారం మేకర్స్ విడుదల చేశారు. ‘రెచ్చిపోవాలే..’ అంటూ సాగే ఈ పాటను శ్రీసాయికిరణ్ రాయగా, శాండిల్య పీసపాటి స్వరపరిచారు. సాకేత్, శాండిల్య ఆలపించారు. గ్రామ జాతరల్లోని సందడిని ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ పాటను తెరకెక్కించినట్టు తెలుస్తున్నది. రాజా గౌతమ్ ఎనర్జిటిక్ స్టెప్పులు ఈ పాటలో హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ర్టాల్లో వంశీ నందిపాటి విడుదల చేయనున్న ఈ చిత్రానికి కెమెరా: మితేష్ పర్వతనేని.