Boys Hostel Trailer | కన్నడ రీసెంట్ బ్లాక్ బస్టర్ హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే (Hostel Hudugaru Bekagiddare). కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి (Rakshit Shetty) సమర్పించిన ఈ సినిమాకు నితిన్ కృష్ణమూర్తి (Nithin Krishna Murthy) దర్శకత్వం వహించాడు. మూడువారాల కిందట కన్నడలో రిలీజైన ఈ సినిమా అక్కడ భీభత్సమైన వసూళ్లు సాధించింది. తాజాగా ఈ సినిమాను తెలుగులో బాయ్స్ హాస్టల్ (Boys Hostel) పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అన్నపూర్ణ స్డూడీయోస్ (Annapurna Studios), చాయ్ బిస్కెట్ (Chai Bisket) సంస్థలు సమర్పిస్తున్న ఈ సినిమా ఆగస్టు 26న తెలుగులో విడుదల కానుంది. కాగా ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు సంబంధించి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను నేడు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ ట్రైలర్‌ను తెలుగు రీసెంట్ బ్లాక్ బస్టర్ బేబి టీమ్ (Baby Team) విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఒ పోస్టర్‌ను విడుదల చేశారు.
The sensational youth blockbuster team joins the crazy youth 💥
Team #BabyTheMovie will launch the #BoysHostelTrailer today at 3 PM ❤️🔥#BoysHostel in cinemas August 26th 🔥#ComeOnBoys@AnnapurnaStdios @ChaiBisketFilms @anuragmayreddy @SharathWhat @GulmoharF @VarunStudios… pic.twitter.com/QB5kx2cxW0
— Vamsi Kaka (@vamsikaka) August 19, 2023
క్రైమ్ కామెడీ (Crime Comedy) నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఓ హాస్టల్ చుట్టూ తిరుగుతుంది. హాస్టల్ రూంలో ఉండే ఐదుగురు స్టూడెంట్ కుర్రాళ్ళలో ఒకరికి షార్ట్ ఫిలిం తీయాలని ఉంటుంది. కానీ ఎగ్జామ్స్ ఉండటంతో వాళ్ల ఫ్రెండ్స్ షార్ట్ ఫిల్మ్ ఆలోచనను కొన్ని రోజులు పక్కన పెట్టమంటారు. ఆ తర్వాత ఓ రోజును హఠాత్తుగా హాస్టల్లో వార్డెన్ శవం దొరుకుతుంది. తన చావుకు వీళ్ళే కారణమంటూ ఆ ఐదుగురు పేర్లు రాసిన సూసైడ్ నోట్ కనిపిస్తుంది. దీంతో ఆ గండం నుంచి బయటపడేందుకు స్టూడెంట్స్ ఎం చేస్తారనేది స్టోరీ. పెళ్లి చూపులు (Pelli Choopulu), ఈ నగరానికి ఏమైంది (ENE) ఫేమ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhaskar) ఈ సినిమాలో గెస్ట్ రోల్లో మెరవనున్నాడు.