రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘స్కంద’. బోయపాటి శ్రీను దర్శకుడు. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. తాజాగా చిత్రం నుంచి ‘గందారబాయి’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా అత్యంత భారీబడ్జెట్తో నిర్మిస్తున్న చిత్రమిది.
ఈ తాజా పాటకు ఎస్ఎస్ థమన్ అందించిన మాస్ స్వరాలకు రామ్,శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో అదరగొట్టారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.