Ram Pothineni- Boyapati Srinu Movie | మాములుగానే మాస్ సినిమాలు వస్తున్నాయంటే బీ, సీ సెంటర్లలో ఓ రేంజ్లో రచ్చ ఉంటుంది. ఇక సింగిల్ థియేటర్లలో సినీ లవర్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అదే బోయపాటి శ్రీను సినిమాలకు రచ్చ రెండింతలుంటుంది. బోయపాటి మాస్ ఎలివేషన్స్ గురించి ఒక పుస్తకమే రాయచ్చు. ప్రస్తుతం టాలీవుడ్లో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్‌గా బోయపాటినే చెప్పుకుంటుంటారు. అఖండతో వంటి బంపర్ హిట్ తర్వాత బోయపాటి రామ్‌తో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్యాచ్ వర్క్ పూర్తి చేసుకుంటుంది. రెండు నెలల్లో విడుదల కాబోతున్న సినిమాపై వీర లెవల్లో అంచనాలున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ను చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా టైటిల్‌ను సోమవారం రివీల్ చేయనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా టైటిల్‌తో పాటు ఓ మాస్ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేస్తున్నారట. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌కు మాస్ ప్రేక్షకుల నుంచి తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకు స్కంధ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
Bringing the Mass Madness of highest order!❤️🔥
The Massive Energetic #BoyapatiRAPO Title Glimpse on July 3rd @ 11:25 AM🗡🔥💥#BoyapatiRAPOonSep15
Ustaad @ramsayz #BoyapatiSreenu @sreeleela14 @MusicThaman @srinivasaaoffl @detakesantosh @StunShiva8 @SS_Screens @ZeeStudios_… pic.twitter.com/TLPtzwDAu0
— Srinivasaa Silver Screen (@SS_Screens) July 1, 2023