Border 2 | గతేడాది గదర్ 2తో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్‌ను తీస్తున్న విషయం తెలిసిందే. ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం బోర్డర్ 2. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో నటించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
అగ్రనటులు సన్నీడియోల్, జాకీష్రాఫ్, సునీల్‌శెట్టి, అక్షయ్ఖన్నా ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా బోర్డర్(Border). భారత్ – పాకిస్థాన్ 1971 యుద్ధ నేపథ్యంలో 1997లో విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. జేపీ దత్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అను మాలిక్, ఆదేశ్ శ్రీవాస్తవ సంగీతం అందించగా.. కేవలం రూ.10 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 65 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఇప్పటికే సీక్వెల్‌కు సంబంధించి షూటింగ్ కూడా ప్రారంభమైంది. అయితే ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించి సాలిడ్ అప్డేట్ను పంచుకున్నారు మేకర్స్.
ఈ సినిమా షూటింగ్లో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ జాయిన్ అయినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో ఫౌజీగా వరుణ్ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. కాగా అంతకుముందు ఈ పాత్రలో ఆయుష్మాన్ ఖురానా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ స్థానంలో వరుణ్‌ను తీసుకున్నట్లు సమాచారం. ఇక బోర్డర్ 2 సినిమాకు అనురాగ్‌సింగ్ దర్శకత్వం వహించనుండగా.. భూషణ్‌కుమార్, కృష్ణన్‌కుమార్, జేపీదత్తా, నిధిదత్తా కలిసి నిర్మిస్తున్నారు.
Also Read..