Border 2 Announcement | 27 ఏండ్ల తర్వాత సీక్వెల్ అనౌన్స్ చేసిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘బోర్డర్’
Border 2 Announcement | బాలీవుడ్ నటుడు సన్నీదేవోల్ ప్రస్తుతం సీక్వెల్‌లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. గతేడాది గదర్ 2తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ నటుడు ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు. అగ్రనటులు సన్నీదేవోల్, జాకీష్రాఫ్, సునీల్‌శెట్టి, అక్షయ్ఖన్నా ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా బోర్డర్ (Border).
Border 2 Announcement | బాలీవుడ్ నటుడు సన్నీదేవోల్ ప్రస్తుతం సీక్వెల్‌లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. గతేడాది గదర్ 2తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ నటుడు ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు. అగ్రనటులు సన్నీదేవోల్, జాకీష్రాఫ్, సునీల్‌శెట్టి, అక్షయ్ఖన్నా ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా బోర్డర్(). భారత్ – పాకిస్థాన్ 1971 యుద్ధ నేపథ్యంలో 1997లో విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. జేపీ దత్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అను మాలిక్, ఆదేశ్ శ్రీవాస్తవ సంగీతం అందించగా.. కేవలం రూ.10 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 65 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా విడుదలై నేటికి 27 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ సీక్వెల్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. దీనితో పాటు స్పెషల్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు.
27 ఏళ్ల క్రితం ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు మళ్లీ తిరిగి వస్తోంది ఇండియాస్ బిగ్గెస్ట్ వార్ ఫిల్మ్ బార్డర్ 2 అంటూ చిత్రయూనిట్ రాసుకొచ్చారు. ఇక బోర్డర్ 2 సినిమాకు అనురాగ్‌సింగ్ దర్శకత్వం వహించనుండగా.. భూషణ్‌కుమార్, కృష్ణన్‌కుమార్, జేపీదత్తా, నిధిదత్తా కలిసి నిర్మిస్తున్నారు. ఆయుష్మాన్ ఖురానా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం.
Ek fauji apne 27 saal purane waade ko pura karne, aa raha hai phirse.
India’s biggest war film, #Border2 🇮🇳Produced by Bhushan Kumar , Krishan Kumar, JP Dutta & Nidhi Dutta will be directed by Anurag Singh #TSeries #JPFilms pic.twitter.com/u1J7KtlHx8
— Sunny Deol (@iamsunnydeol) June 13, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

